గణపురం పోలీస్ స్టేషన్ గోడశంకుస్థాపన
షాపింగ్ కాoప్లెక్షుకూడా
పునాదివేసినఎమ్మెల్యేసత్తెన్న
గణపురం
గణపురం పోలీస్ స్టేషన్ ప్రహరీగోడ,షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారంశంకుస్థాపన చేశారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లతో కలిసి
భూమిపూజలోఆయనపాల్గొన్నారు. అనంతరంఎమ్మెల్యే మాట్లాడుతూసీఎం రేవంత్ సహకారంతో, ప్రజలు, అధికారులుఅందరిసంక్షేమం కోసం కోట్లాది రూపాయల వ్యయంతోభూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిజరుగుతున్నద న్నారు.అదేవిధంగా, గాంధీనగర్ నుండి – జంగాలపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు రూ.20 కోట్ల నిధులు, హనుమాన్ కట్ట నుండి కొత్తపల్లి వరకు రూ.18 కోట్ల నిధులతో సీడీఎఫ్ నిధులతో పాటు కేంద్ర నిధులతో మండల కేంద్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు.కాకతీయుల కాలంనాటికోటగుళ్ళు, రెడ్డిగుళ్లను కూడాఅభివృద్ధి చేస్తున్నామన్నారు.గణపుర సముద్రంకట్టపైత్వరలోనే కాటేజిలతో పాటు,
చెరువులోబోటింగ్ సౌకర్యం ఏర్పాటుకూడాచేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్టేషన్ ఆవరణలో 2ఎకరాలస్థలము oదని అందులోపోలీసులకొత్త క్వార్టర్స్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, గణపురంసీఐ కరుణాకర్ రావు, గణపురం ఎస్సై అశోక్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



