Wednesday, April 1, 2026

యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద…

బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి

స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనోత్సవం సందర్భంగా బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆయన స్వగ్రామం వంగపహాడ్ లో, వరంగల్ లోని పాపాయ్ పేట్ చమన్ దగ్గర మాజీ మేయర్ గుండా ప్రకాష్ తో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…యువతకు స్ఫూర్తి ప్రదాత, భారత దేశ ఔనత్వాన్ని తన ప్రసంగాలతో, బోధనలతో, నడవడికతో విశ్వవ్యాపితం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని,నాడు దేశ ప్రజల్లో దేశభక్తిని జాతీయ భావనను నింపడానికి మూడుకోట్ల దేవతలను పక్కన పెట్టండి భారత మాతను పూజించండి అన్న నినాదాన్నిచ్చారని రాకేశ్ రెడ్డి అన్నారు…ప్రపంచ సర్వమత మహాసభల్లో అమెరికా గడ్డ మీద నుండి “My dear brothers and sisters” అని ప్రపంచానికి స్నేహ హస్తం అందించి, భారతీయ సోదర భావనకున్న శక్తిని చూపించిన అచంచల దేశభక్తుడని కొనియాడారు…స్వామి వివేకానంద జీవించింది 39 ఏళ్లు మాత్రమే అయినప్పటికి వారు మరణించి 162 ఏళ్లైనప్పటికి వారు రగిలించిన స్ఫూర్తి మనందరిలో ఉండటం వారి ఔన్నత్యానికి నిదర్శనమని,.
స్వామి వివేకానంద నాయకులకే నాయకుడు భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వారు ఎంతగానో స్ఫూర్తిని అందించారన్నారు…
వారి స్ఫూర్తితోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి మహనీయులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని,మన దేశంలో ఆగస్టు 15, జనవరి 26 లను ఎలా జరుపుకుంటామో జనవరి 12 న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజానోత్సవం కూడా అంతే ఘనంగా, వైభవంగా జరుపుకుంటామన్నారు..భారత వేద ఉపనిషత్తుల సారాన్ని, ఇక్కడి ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పి భారత దేశం ఔన్నత్యాన్ని ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసారని,మన దేశాన్ని పాములు ఆడించే వాళ్ళు నివసించే దేశమని, పేదలు, బిచ్చగాళ్ల ఉంటారని, మూఢనమ్మకాలకు నెలవని ప్రచారం చేస్తున్న క్రమంలో మన దేశం విశ్వగురువని, ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశం, నాగరికత తెలిసిన దేశం, రత్నాలు రాశులుగా పోసి దేశమని సిరిసంపదలు నెలవని ప్రపంచం కాళ్ళు తెరిపించారన్నారు…అలాంటి మహా పురుషులు యుగానికొక్కలు, శతాబ్దాలకు ఒక్కరూ పుడతారు. 162 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద పుట్టారు. కాబట్టి అలాంటి మహనీయుడి జయంతి, జాతీయ యువజనోత్సవం సందర్భంగా ఆ మహనీయున్ని స్మరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వంగపహాడ్ లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు చింతం శ్రీనివాస్, దేవయ్య, పురుషోత్తం యాదవ్, గండు రాజయ్య, దోమ ప్రకాష్, తెట్టే రవి, అశోక్, హరీష్ గౌడ్, రజినీకాంత్, కళ్యాణ్ లు ఉన్నారు.పాపయ్య పేట్ చమాన్ దగ్గర మాజీ మేయర్ గుండా ప్రకాష్, ఉత్సవ నిర్వాహకులు ఏలేషా, వినోద్ ఆనంద్, శివాజీ, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సద్దంత్, సీనియర్ నాయకులు రవి , పురుషోత్తం యాదవ్ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

HANAMKONDA

BHUPALAPALLY

WARANGAL

HANMAKONDA