మల్కాజిగిరి: మేము పని చేసే నాయకులం చేతులుపుకుంటూ తిరిగేవాళ్ళం కాదనీ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు.
కాలుకు ముళ్ళు విరిగితే పంటితో తీసే సర్వీస్ చేసే వాళ్ళం అని ఎన్నికల ముందు చెప్పాను. దానిని అవలంబిస్తున్న.
సమస్యల విషవలయం చేధిస్తున్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ లో జమ చేసినం,
కంటోన్మెంట్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని,
జనాభా పెరుగుదలకు అనుగుణంగా మంచినీరు సరఫరా కోసం, మురుగు నీరు, వరదనీరు పోయేందుకు ఏర్పాటు చేయబోతున్నామన్నాడు.
ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి పనులు చేయించుకోవాలి అని కోరుతున్న.
ప్రజల డబ్బులు వందశాతం సద్వినియోగం చేద్దాం.
మోదీ గారు చెప్పినట్టు నేను కూడా మీ సేవకున్నీ.
ధర్మం, శ్రమ, ప్రజలను నమ్ముకున్న వాన్ని.
నా 25 ఏళ్ల చరిత్ర మీ ముందు ఉంది.
దానిని గుర్తించి నాకు ఓటు వేసి 4 లక్షల మెజారిటీ ఇచ్చారనీ,
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.


