



దేవాలయం అభివృద్ధి లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉన్నది
ఇందిరమ్మ చీరలతో వచ్చిన అక్క చెల్లెలను చూస్తుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది
ఇండ్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు కట్టించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది
హామీ ఇచ్చిన పథకాలని అమలు చేస్తాం
జిల్లాలు మార్చే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు
భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి
భూపాలపల్లి
ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేగొండ మండలం, కొడవటంచ శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి దేవతామూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనాలను అందుకున్నామనీఅనంతరం దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేవాలయ అభివృద్ది పనుల్లో జిల్లా ఇంచార్జీ మంత్రిగా భాగస్వాములు కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించడం జరిగిందనీ
అనంతరం చెల్పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లడుతూ..
ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిన ఆడబిడ్డల ఆనందం సభలో చూస్తుంటే తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసిన ప్రగతి తేజస్సు కనిపించిందనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరంతరం శ్రమిస్తూ గడిచిన రెండేళ్లలో పేదవారి సంక్షేమానికి, భద్రతకు భరోసా కల్పించే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నామని
గత పదేళ్ల పాలనలో పేదల ఆత్మగౌరవ చిహ్నమైన ఇండ్లను గత పాలకులు కట్టించలేదు. ప్రజాప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే మొదటి విడత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరిగిందనీ ఏప్రిల్ లో రెండో విడత ప్రారంభమవుతుంది.ఆ తరువాత కూడా మరో మూడు విడతల్లో అర్హులైన పేదలకు సొంతిల్లు ఇస్తామనీ
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేశారన్నారు.. వందకు వంద శాతం పట్టణాలు, గ్రామాల్లోని అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకుందనీ
అదే విధంగా కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కొన్ని సర్వే నెంబర్లలో భూ వివాదాలు ఉన్నాయనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న భూ యజమానులు సమస్యలను ఎదుర్కొంటున్నారనీ. అటువంటి భూ వివాదాలను పరిష్కరించేందుకు భూభారతి చటాన్ని తీసుకొచ్చామని. లైసెన్స్ డ్ సర్వేయర్లను నియమించి, సర్వేలు ప్రారంభించాము. త్వరలోనే ఇలాంటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీనిస్తున్నామనీ.ప్రజాప్రభుత్వంపై ఎల్లప్పుడూ ఉండాలని, ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో అభివృద్ధి కాంక్షించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

