MULUGU MEDIA 10
రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
సోమవారం ములుగు మండలం లోని
జంగాలపల్లి గ్రామం లో 20 కోట్ల నిధులతో జంగాలపల్లి నుండి గాంధీనగర్ రహదారి కి.టి . 0/0 నుండి 17/0, 19/5-24/030 వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో
కలసి శంకుస్థాపన చేశారు.
జంగాలపల్లి క్రాస్ వద్ద ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయం వెళ్ళే మార్గం గుర్తుగా సుందరీకరణ చిహ్నాలను ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా గారు,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కానూరు అశోక్ గౌడ్,అధికార ప్రతినిధి కుమార్ గౌడ్,ప్రధాన కార్యదర్శి అశోక్ , PACS మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు



