
ఎన్నికలు జరిగే పరిధిలో బయటి వ్యక్తులు ఉండరాదు
వరంగల్ సిపి
వరంగల్ మున్సిపల్ ఎన్నికల సంబంధించి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ ప్రచారం ముగుస్తుంది, తరువాత బయటి వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఉండరాదనీ
అలా ఉన్నట్లు అయితే వారిపై చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ తెలిపారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే జనగామ, ఘన్పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచారం నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు , కార్యకర్తలు , ప్రచార సిబ్బంది మరియు ఇతరులు అందరూ తప్పనిసరిగా రేపు సాయంత్రం 5.00 గంటల లోపు తమ తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లిపోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ తెలిపారు. నిర్దేశిత సమయం అనంతరం కమిషనరేట్ పరిధిలో అనవసరంగా సంచరిస్తున్నట్లు గుర్తించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై ఎన్నికల నిబంధనలు మరియు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

